వ్యవసాయ విశ్వవిద్యాలయ కలుపు యాజమాన్య విభాగానికి పురస్కారం

ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కలుపు యాజమాన్య విభాగం దేశంలోనే అత్యుత్తమ పరిశోధన కేంద్రం పురస్కారం పొందింది.

Published : 20 Jun 2024 05:20 IST

ఒడిశా వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ పీకే రౌల్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న శాస్త్రవేత్తలు పద్మజ, రామ్‌ప్రకాశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కలుపు యాజమాన్య విభాగం దేశంలోనే అత్యుత్తమ పరిశోధన కేంద్రం పురస్కారం పొందింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ లో జరుగుతోన్న అఖిల భారత కలుపు యాజమాన్య సంస్థ వార్షిక సమావేశాల్లో, 2023-24 సంవత్సరానికి గాను తెలంగాణ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు టి.రామ్‌ప్రకాశ్, పద్మజలు ఒడిశా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి పీకే రౌల్‌ చేతుల మీదుగా దీన్ని అందుకున్నారు. అఖిల భారత కలుపు యాజమాన్య, పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో  దేశంలోని వివిధ రాష్ట్రాలలో 24 కేంద్రాలు పనిచేస్తున్నాయి. పురస్కారం పొందిన శాస్త్రవేత్తలను విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకుడు పి.రఘురామిరెడ్డి, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం సహ సంచాలకుడు మల్లారెడ్డి అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని