బౌరంపేట భూములపై కౌంటర్‌ దాఖలు చేయండి

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌-గండిమైసమ్మ మండలం బౌరంపేటలో రూ.కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూముల వివాదంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.

Published : 21 Jun 2024 04:59 IST

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌-గండిమైసమ్మ మండలం బౌరంపేటలో రూ.కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూముల వివాదంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. బౌరంపేటలోని సర్వే నం.166లోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని వజ్ర బిల్డర్లు, ఇతర ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకొని లేఅవుట్‌ వేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన జి.రఘువీర్‌రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎం.ప్రతీక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాఘరావు అనే వ్యక్తికి ఉన్న 10 ఎకరాలకు సర్వే నం.166లో అంతర్గత నంబర్లు వేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని తెలిపారు. వజ్ర బిల్డర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంపై కౌంటరు దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ పూర్తిస్థాయిలో కౌంటరు దాఖలు చేయడానికి మరికొంత గడువు కావాలని కోరారు. దీనికి ధర్మాసనం అనుమతిస్తూ విచారణను జులై 2వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు