ఎరువులపై జీఎస్టీ రద్దు చేయాలి

పంటల సాగుకు వినియోగిస్తున్న ఎరువులపై జీఎస్టీ రద్దు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 22న దిల్లీలో జీఎస్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది.

Published : 21 Jun 2024 05:00 IST

దిల్లీలో రేపటి జీఎస్టీ మండలి సమావేశానికి తెలంగాణ సూచనలు

ఈనాడు, హైదరాబాద్‌: పంటల సాగుకు వినియోగిస్తున్న ఎరువులపై జీఎస్టీ రద్దు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 22న దిల్లీలో జీఎస్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. దీనికన్నా ముందుగా శుక్రవారమే కేంద్ర ఆర్థికశాఖ అన్ని రాష్ట్రాల వాణిజ్య పన్నులశాఖ కమిషనర్లు, కార్యదర్శులతో సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది. జీఎస్టీలో మార్పులపై అన్ని రాష్ట్రాల నుంచి సూచనలు, సలహాలను కేంద్రం ఆహ్వానించింది. మండలానికో ఇంటర్నేషనల్‌ మోడల్‌ ప్రభుత్వ పాఠశాల నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పేద పిల్లల కోసం నిర్మించే వాటిపై జీఎస్టీ వసూలులో రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం కోరనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు