వంతెన నిర్మాణంలో 3డీ సాంకేతికత

సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీహెచ్‌లో దేశంలోనే తొలిసారిగా 3డీ సాంకేతికతతో వంతెన నిర్మించినట్లు ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.ఎస్‌.మూర్తి తెలిపారు.

Published : 21 Jun 2024 05:03 IST

ఐఐటీహెచ్‌లో ప్రయోగాత్మకంగా నిర్మాణం 

హైదరాబాద్‌ ఐఐటీ ప్రాంగణంలో 3డీ సాంకేతికతతో నిర్మించిన వంతెన

సంగారెడ్డి టౌన్, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీహెచ్‌లో దేశంలోనే తొలిసారిగా 3డీ సాంకేతికతతో వంతెన నిర్మించినట్లు ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.ఎస్‌.మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ సుబ్రహ్మణ్యం బృందం 3డీ సాంకేతికతను వినియోగించి ఐఐటీ ప్రాంగణంలో 7.5 మీటర్ల పొడవైన వంతెన నిర్మించిందన్నారు. ప్రొఫెసర్‌ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘‘నిర్మాణాల్లో 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ సాంకేతికత వినియోగానికి సింప్లిఫోర్జ్‌ అంకుర సంస్థతో కలిసి పనిచేస్తున్నాం. ఈ విధానంతో కట్టడాలను తక్కువ సామగ్రితోనే నిర్మించవచ్చు. అవి నాణ్యంగా ఉంటాయి’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని