పర్యాటక భవన్‌లో ఖాళీ కుర్చీలు

రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని పర్యాటక భవన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేయగా విస్తుబోయే విషయాలు వెలుగుచూశాయి.

Published : 21 Jun 2024 05:04 IST

తక్కువగా ఉద్యోగుల హాజరు
మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి

హాజరు పట్టికను పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని పర్యాటక భవన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేయగా విస్తుబోయే విషయాలు వెలుగుచూశాయి. భవనంలోని ప్రతి అంతస్తుకు వెళ్లి మంత్రి తనిఖీ చేశారు. ఉద్యోగులు, అధికారులు చాలామంది కార్యాలయానికి రాకపోవడం, వారి కుర్చీలు ఖాళీగా ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరు తక్కువగా ఉందని, సమయపాలన పాటించడం లేదని గుర్తించారు. హాజరు పట్టిక, బయోమెట్రిక్‌ను పరిశీలించారు. గత సంవత్సర కాలానికి సంబంధించిన హాజరు జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కింది స్థాయి ఉద్యోగుల నుంచి అధికారుల వరకు బయోమెట్రిక్‌ హాజరు పద్ధతిని అమలు చేయాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని