ఐఐటీ బాంబేకే జైకొట్టిన టాపర్లు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ టాపర్లలో అధిక శాతం మంది ఐఐటీ బాంబేకే జైకొట్టారు. అందులోనూ నాలుగేళ్ల బీటెక్‌ సీఎస్‌ఈలోనే ప్రవేశాలు పొందారు.

Updated : 21 Jun 2024 05:27 IST

తొలి విడత జోసా సీట్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ టాపర్లలో అధిక శాతం మంది ఐఐటీ బాంబేకే జైకొట్టారు. అందులోనూ నాలుగేళ్ల బీటెక్‌ సీఎస్‌ఈలోనే ప్రవేశాలు పొందారు. ఓపెన్‌ కోటాలో సీఎస్‌ఈ బ్రాంచీలో 61 సీట్లు ఉండగా, 68వ ర్యాంకుతో అవన్నీ భర్తీ అయ్యాయి. జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) తొలి విడత సీట్లను గురువారం కేటాయించింది. ఐఐటీ బాంబే తర్వాత దిల్లీ, మద్రాస్‌లో ఎక్కువ మంది టాపర్లు చేరారు. ఐఐటీ హైదరాబాద్‌లో సీఎస్‌ఈ సీట్లు ఓపెన్‌ కోటా కింద 649 ర్యాంకుతో భర్తీ అయ్యాయి. ఇక్కడ సీఎస్‌ఈలో మొత్తం 65 సీట్లుండగా, ఓపెన్‌ కోటాలో 20 ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని