ఆర్టీసీ ఖాతాల స్తంభనపై హైకోర్టు స్టే

ఉద్యోగుల పీఎఫ్‌ మొత్తాలను జమ చేయకపోవడంతో ఆర్టీసీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ మార్చి 21న ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

Published : 22 Jun 2024 04:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల పీఎఫ్‌ మొత్తాలను జమ చేయకపోవడంతో ఆర్టీసీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ మార్చి 21న ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. పీఎఫ్‌ కమిషనర్‌ ఆదేశాలపై ఆర్టీసీ హైకోర్టులో పిటిషన్‌ వేయగా... జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఆర్టీసీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... రాష్ట్రం విడిపోయినా ఈపీఎఫ్‌ ట్రస్టులో నిధుల విభజన జరగలేదని, ఖాతాలను స్తంభింపజేయడం చట్టవిరుద్ధమన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఆర్టీసీ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ సమర్పించాలంటూ పీఎఫ్‌ కమిషనర్, విద్యానగర్‌ యూనియన్‌ బ్యాంకులకు నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణను జులై 15కు వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని