కవిత కస్టడీ జులై 5 వరకు పొడిగింపు

దిల్లీ మద్యం విధానంలో అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు విధించిన జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు జులై 5 వరకు పొడిగించింది.

Published : 22 Jun 2024 04:16 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం విధానంలో అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు విధించిన జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు జులై 5 వరకు పొడిగించింది. శుక్రవారంతో కస్టడీ గడువు ముగియగా.. తిహాడ్‌ జైల్లో ఉన్న ఆమెను పోలీసు అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీని పొడిగించాలని సీబీఐ తరఫు న్యాయవాదులు విన్నవించగా.. కోర్టు పై ఆదేశాలిచ్చింది. ఇదే కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై కోర్టు జులై 3న విచారణ చేపట్టనుంది. ఈడీ కేసులో ఆమెకు ఇదివరకు విధించిన జ్యుడిషియల్‌ కస్టడీ జులై 3 వరకు ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని