తెలంగాణలో పప్పుదినుసుల బోర్డు నెలకొల్పాలి

తెలంగాణలో పప్పుదినుసుల బోర్డును ఏర్పాటుచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

Published : 22 Jun 2024 04:17 IST

కేంద్ర మంత్రికి తుమ్మల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో పప్పుదినుసుల బోర్డును ఏర్పాటుచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పప్పుదినుసుల సాగుపై  శుక్రవారం కేంద్ర మంత్రి దిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తుమ్మల హైదరాబాద్‌ సచివాలయం నుంచి పాల్గొని మాట్లాడారు. బోర్డు ఏర్పాటు ద్వారా పంట సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు రైతులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. పప్పుదినుసుల సేకరణకు ప్రస్తుతమున్న 25 శాతం పరిమితిని ఎత్తివేసి 100 శాతానికి పెంచాలని కోరారు. ‘‘తెలంగాణలో పండించే తాండూరు కందిపప్పునకు ప్రపంచంలోనే ప్రత్యేకస్థానం ఉంది. రైతులకు, జాతీయ ఆహార భద్రత మిషన్‌ కింద ఉత్పాదకాలకు ఇచ్చే సబ్సిడీని పెంచాలి. ఆయిల్‌ పామ్‌ సాగు కోసం రైతులను మరింత ప్రోత్సహించాలి. గత ఎన్నికలకు ముందు పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించారు. దీంతో దేశీయంగా ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతుల ప్రయోజనాలకు భంగం కలిగింది. ఆయిల్‌ పామ్‌పై దిగుమతి సుంకాన్ని విధించేందుకు చర్యలు చేపట్టాలి’’ అని మంత్రి తుమ్మల కేంద్ర మంత్రిని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని