బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం: మంత్రి జూపల్లి

తెలంగాణ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Published : 22 Jun 2024 04:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సంస్థ ఉద్యోగులు శుక్రవారం మంత్రిని కలిసి పలు సమస్యలను విన్నవించారు. ప్రభుత్వానికి ఏటా రూ.35 వేల- 40 వేల కోట్ల ఆదాయం సమకూరుస్తున్న సంస్థ కార్యకలాపాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 280 మంది ఉద్యోగులు పనిచేయాల్సిన చోట కేవలం 104 మందే విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవలే బీర్ల సరఫరా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న బ్రూవరీల ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగలేదని, వాటి అనుమతులు రద్దు చేసి పునఃపరిశీలన కోసం ప్రభుత్వానికి నివేదించినట్లు మంత్రికి విన్నవించారు. అనంతరం కార్పొరేషన్‌ ఉద్యోగులు ఎక్సైజ్‌ కమిషనర్‌ను కూడా కలిసి పరిస్థితులను వివరించారు. తెలంగాణ ప్రభుత్వరంగ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి జీవన్, కార్పొరేషన్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాశీనాథ్, ఉపాధ్యక్షుడు శ్యాంకుమార్, సలహాదారుల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని