24 నుంచి ఉపాధ్యాయ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన

మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయ, అధ్యాపక నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి 30 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు.

Published : 22 Jun 2024 04:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయ, అధ్యాపక నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి 30 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. బంజారాహిల్స్‌లోని బంజారాభవన్‌లో ఈ పరిశీలన ఉంటుందని, అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. ఈ నెల 24న లైబ్రేరియన్, ఫిజికల్‌ డైరెక్టర్, డిగ్రీ లెక్చరర్స్‌ అభ్యర్థులకు, 25న జేఎల్‌ (ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ), 26న జేఎల్‌ (తెలుగు, గణితం), పీజీటీ (తెలుగు, హిందీ), 27న పీజీటీ (ఇంగ్లిష్, గణితం, ఫిజిక్స్, బయాలజీ, సోషల్‌), ఫిజికల్‌ డైరెక్టర్‌ గ్రేడ్‌-2, 28న టీజీటీ (హిందీ, బయాలజికల్‌సైన్స్, సోషల్‌), 29న టీజీటీ(ఇంగ్లిష్, ఫిజికల్‌సైన్స్‌), 30న టీజీటీ(తెలుగు, గణితం) అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని