పాలిటెక్నిక్‌ సీట్లు తగ్గాయ్‌

రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా సీట్లు దాదాపు మూడు వేలకు తగ్గాయి. పలు ప్రైవేట్‌ కళాశాలలు డిమాండ్‌ లేని సీట్లను తగ్గించుకొని వాటి స్థానంలో సీఎస్‌ఈ, ఏఐ అండ్‌ ఎంఎల్‌ తదితర సీట్ల కన్వర్షన్‌కు ఏఐసీటీఈకి దరఖాస్తు చేయగా...ఆమోదం లభించింది.

Published : 22 Jun 2024 04:21 IST

కొత్త సీట్లకు అనుమతి ఇవ్వకపోవడమే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా సీట్లు దాదాపు మూడు వేలకు తగ్గాయి. పలు ప్రైవేట్‌ కళాశాలలు డిమాండ్‌ లేని సీట్లను తగ్గించుకొని వాటి స్థానంలో సీఎస్‌ఈ, ఏఐ అండ్‌ ఎంఎల్‌ తదితర సీట్ల కన్వర్షన్‌కు ఏఐసీటీఈకి దరఖాస్తు చేయగా...ఆమోదం లభించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదు. గతేడాది మొత్తం 29,396 సీట్లుండగా... శనివారం నుంచి జరిగే పాలిసెట్‌ కౌన్సెలింగ్‌లో కేవలం 26,412 మాత్రమే ఉన్నాయి. మరో వైపు కొన్ని కళాశాలలు సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈకి దరఖాస్తు చేయగా.. సుమారు మరో 3 వేల సీట్లు మంజూరయ్యాయి. వాటికి కూడా విద్యాశాఖ నుంచి అనుమతి రాలేదు. అదనపు సీట్లకైతే బోధన రుసుములు చెల్లించాల్సి ఉన్నందున ఆర్థిక భారం పడుతుందని అంచనా. కనీసం కన్వర్షన్‌ సీట్లకు కూడా ఎందుకు అనుమతి ఇవ్వలేదో అర్ధం కావడం లేదని కళాశాలల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని