ఈనెల 24 నుంచి వెబ్‌సైట్లో గ్రూప్‌-1 ఓఎంఆర్‌ ఇమేజింగ్‌ పత్రాలు

రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు 3,02,172 మంది అభ్యర్థులు హాజరయ్యారని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు.

Published : 22 Jun 2024 04:21 IST

పరీక్షకు హాజరైన 3,02,172 మంది అభ్యర్థులు 

 ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు 3,02,172 మంది అభ్యర్థులు హాజరయ్యారని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్‌ ఇమేజింగ్‌ పత్రాలు ఈ నెల 24 సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లో వివరాలు నమోదు చేసి వాటిని పొందవచ్చని సూచించారు. రాష్ట్రంలో 563 పోస్టులతో కూడిన గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటనకు 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. 74.86 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని నవీన్‌ నికోలస్‌ ప్రకటించారు. అత్యధికంగా వనపర్తిలో 82.74 హాజరు శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 61.78 శాతం నమోదైందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని