రాష్ట్రంలో మరికొన్ని పీజీ మెడికల్‌ సీట్లు

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రెండు కొత్త పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఎమర్జెన్సీ మెడిసిన్‌తో పాటు జెరియాట్రిక్స్, ఎనెస్తీషియా, పీడియాట్రిక్స్, రేడియో డయాగ్నసిస్, ఆఫ్తాల్మాలజీలో ఎంఎస్‌ కోర్సులు మంజూరయ్యాయి.

Published : 22 Jun 2024 04:22 IST

నాలుగు మెడికల్‌ కాలేజీల్లో కొత్త కోర్సులు
గాంధీలో జెరియాట్రిక్స్‌లో పీజీ కోర్సు 

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రెండు కొత్త పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఎమర్జెన్సీ మెడిసిన్‌తో పాటు జెరియాట్రిక్స్, ఎనెస్తీషియా, పీడియాట్రిక్స్, రేడియో డయాగ్నసిస్, ఆఫ్తాల్మాలజీలో ఎంఎస్‌ కోర్సులు మంజూరయ్యాయి. గాంధీ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా మంజూరైన పీజీ మెడిసిన్‌ కోర్సులు, వైద్య కళాశాలల వివరాలను జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాలలో గైనకాలజీ పీజీ సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్, జెరియాట్రిక్స్‌లో ఎండీ కోర్సులను మంజూరు చేసింది. మహబూబ్‌నగర్‌ వైద్య కళాశాలలో ఎంఎస్‌ ఆఫ్తాల్మాలజీ, ఎనెస్తీషియా, పీడియాట్రిక్స్‌లో ఎండీ కోర్సులకు అనుమతి ఇచ్చింది. నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎండీ రేడియో డయాగ్నసిస్‌ కోర్సును మంజూరు చేసింది. సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో గైనకాలజీ ఎండీ కోర్సుతో పాటు ఈఎన్‌టీలో ఎంఎస్‌ కోర్సు ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. ఈ కోర్సులన్నీ 2024-25 విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయని ఎన్‌ఎంసీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని