అన్నారంలో జియో ఫిజికల్‌ పరీక్షలు ప్రారంభం

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వద్ద జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ(ఎన్డీఎస్‌ఏ) ఆదేశాల మేరకు నీటి పరిశోధక బృందం శుక్రవారం జియో ఫిజికల్‌ పరీక్షలను ప్రారంభించింది.

Updated : 22 Jun 2024 05:51 IST

వెంట్‌ వద్ద బోర్‌వెల్‌ తవ్వకం పనులు

కాళేశ్వరం, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వద్ద జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ(ఎన్డీఎస్‌ఏ) ఆదేశాల మేరకు నీటి పరిశోధక బృందం శుక్రవారం జియో ఫిజికల్‌ పరీక్షలను ప్రారంభించింది. పుణెకు చెందిన శాస్త్రవేత్త ధనుంజయ్‌నాయుడు నేతృత్వంలో తెలంగాణ ఎన్డీఎస్‌ఏ డిప్యూటీ సీఈ నాగలక్ష్మి, ఈఈ శ్రీలత, డిప్యూటీ ఈఈ సతీష్‌కుమార్‌ సమక్షంలో పలు పరీక్షలు నిర్వహించారు. సీపేజీలు ఏర్పడిన ప్రాంతంలో తొలుత అత్యాధునిక జియో రాడార్‌ పరికరంతో 34వ వెంట్‌ వద్ద పరీక్ష నిర్వహించారు. సదరు పరికరంతో ఆ ప్రాంతాన్ని స్కానింగ్‌ చేస్తూ లోపలి భాగంలోని పరిస్థితులను కంప్యూటర్‌లో చూశారు. అలాగే సమాంతర సీస్మిక్‌ వేవ్‌ పద్ధతిలో బోర్‌వెల్‌ రంధ్రం నుంచి సుమారు 25 మీటర్ల కేబుల్‌ తీగను భూమిలోకి పంపుతూ పరీక్ష నిర్వహించారు. దిగువ ప్రాంతంలో బ్యారేజీ పొడవునా సుమారు 5 వేల సీకెంట్‌ పైల్స్‌ ఉండగా ఈ పరీక్షల ద్వారా వాటి స్థితిగతులను అధ్యయనం చేయనున్నారు. అధికారులు ఈ పరీక్షల ఫలితాల నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈఈ యాదగిరి, డీఈఈలు రవిచంద్ర, సతీష్, జేఈఈలు యాకయ్య, శ్రావణ్, రాజేష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని