‘విడాకుల కేసులో భార్య ప్రియుడినీ ప్రతివాదిగా చేర్చాలి’

వివాహం రద్దు కోరుతూ భర్త దాఖలు చేసిన విడాకుల కేసులో భార్య ప్రియుడినీ ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది.

Published : 23 Jun 2024 05:29 IST

తీర్పు వెలువరించిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: వివాహం రద్దు కోరుతూ భర్త దాఖలు చేసిన విడాకుల కేసులో భార్య ప్రియుడినీ ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ విడాకులు కోరుతున్నప్పుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికీ వివరణ ఇవ్వడానికి అవకాశమివ్వాలని అభిప్రాయపడింది. విడాకుల కేసులో భార్య ప్రియుడినీ ప్రతివాదిగా చేర్చాలన్న అభ్యర్థనను కుటుంబన్యాయస్థానం తిరస్కరించడాన్ని సవాలుచేస్తూ హైదరాబాద్‌కు చెందిన పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ ఎ.లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రియుడి భార్య కూడా పిటిషనర్‌ భార్యకు తన భర్తతో వివాహేతర సంబంధం ఉందంటూ కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించారన్నారు. దీన్ని పట్టించుకోకుండా పిటిషనర్‌ దరఖాస్తును తిరస్కరించడం చట్టవిరుద్ధమని న్యాయమూర్తి పేర్కొన్నారు. కింది కోర్టు ఉత్తర్వులను రద్దుచేశారు. ప్రియుడిని ప్రతివాదిగా చేర్చి విడాకుల కేసు విచారణ చేపట్టాలని ఆదేశించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని