తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలంలో శనివారం 13.1 సెంటీ మీటర్ల భారీ వర్షం కురిసింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 4.7, నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో 4.4, సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదయింది.

Published : 23 Jun 2024 05:58 IST

ఉట్నూరులో 13.1 సెం.మీ. నమోదు 

ఈనాడు, హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలంలో శనివారం 13.1 సెంటీ మీటర్ల భారీ వర్షం కురిసింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 4.7, నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో 4.4, సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదయింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం గుండిలో 13 సెం.మీ., ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో 12.2 సెం.మీ. భారీ వర్షం కురిసింది. ఆది, సోమ వారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు