కస్టమ్స్‌ షోకాజ్‌ నోటీసులు సబబే

స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ పథకం కింద బంగారు కడ్డీల దిగుమతిలో సుంకం ఎగవేత జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కస్టమ్స్‌ శాఖ జారీ చేసిన షోకాజ్‌ నోటీసులను రద్దు చేయాలన్న శ్రీకృష్ణ ఎగ్జిమ్‌ ఎల్‌ఎల్‌పీ అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది.

Published : 23 Jun 2024 03:55 IST

శ్రీకృష్ణ ఎగ్జిమ్‌ ఎల్‌ఎల్‌పీ పిటిషన్‌లను కొట్టివేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ పథకం కింద బంగారు కడ్డీల దిగుమతిలో సుంకం ఎగవేత జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కస్టమ్స్‌ శాఖ జారీ చేసిన షోకాజ్‌ నోటీసులను రద్దు చేయాలన్న శ్రీకృష్ణ ఎగ్జిమ్‌ ఎల్‌ఎల్‌పీ అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. చట్టబద్ధమైన సంస్థలు జారీ చేసే షోకాజ్‌ నోటీసుల్లో హైకోర్టులు విచక్షణాధికారాన్ని వినియోగించుకుని జోక్యం చేసుకోజాలవని పేర్కొంది. నగల తయారీ, ఎగుమతులు చేపట్టడానికి బంగారు కడ్డీలను దిగుమతి చేసుకోవడంలో పన్ను ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో కస్టమ్స్‌ అధికారులు శ్రీకృష్ణ గ్రూపు కంపెనీలు, అనుబంధ సంస్థలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అనంతరం కస్టమ్స్‌ శాఖ రెండు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వీటిని సవాల్‌ చేస్తూ శ్రీకృష్ణ ఎగ్జిమ్‌ ఎల్‌ఎల్‌పీ రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేసింది. వీటిపై విచారించిన న్యాయమూర్తులు జస్టిస్‌ పి.శ్యాం కోశీ, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం.. ఆ పిటిషన్‌లను కొట్టివేస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. చట్టబద్ధమైన సంస్థలు నిబంధనలకు లోబడి జారీ చేసిన షోకాజ్‌ నోటీసుల్లో జోక్యం చేసుకోజాలమంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని