చొప్పదండి ఎమ్మెల్యేకు సీఎం రేవంత్‌ పరామర్శ

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. గురువారం రాత్రి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

Published : 23 Jun 2024 04:03 IST

ముఖ్యమంత్రి రేవంత్‌ను పట్టుకుని విలపిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.. చిత్రంలో సత్యం పిల్లలు యోజిత్, రుషికశ్రీ

అల్వాల్, న్యూస్‌టుడే: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. గురువారం రాత్రి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌ పంచశీల కాలనీలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న రేవంత్‌.. రూపాదేవి చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సత్యం, ఆయన పిల్లలు యోజిత్, రుషికశ్రీలను ఓదార్చారు. సీఎంను చూడగానే సత్యం భోరుమంటూ విలపించారు. సీఎం వెంట ఆయన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని