మావోయిస్టుల డంప్‌లో నకిలీ నోట్ల నమూనాలు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు చెందిన డంప్‌లో నకిలీ నోట్ల నమూనాలు భద్రతా బలగాలకు లభించాయి.

Published : 24 Jun 2024 04:19 IST

భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్ల నమూనాలు, ప్రింటింగ్‌ తదితర సామగ్రి

దుమ్ముగూడెం, చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు చెందిన డంప్‌లో నకిలీ నోట్ల నమూనాలు భద్రతా బలగాలకు లభించాయి. ఆదివారం కొరజ్‌గుడ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టిన భద్రతా బలగాలు.. మావోయిస్టులకు చెందిన ఓ డంప్‌ను కనుగొన్నాయి. అందులో ప్రింటింగ్‌ పరికరాలు రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్ల నమూనాలను గుర్తించి..  స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులు నకిలీ నోట్లను ముద్రించి.. చెలామణి చేస్తున్నారని పోలీస్‌ అధికారులు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని