దారిలేని పచ్చని చిలుకలగుట్ట.. సౌకర్యాలులేని అందాల పాకాల..

వరంగల్‌ జిల్లా ఖానాపురం, కొత్తగూడ మండలాల పరిధిలోని పచ్చని చిలుకలగుట్ట.. పక్కనే పాకాల సరస్సు పర్యాటకులను మైమరపిస్తాయి.

Published : 24 Jun 2024 04:21 IST

వాచ్‌టవర్‌ నుంచి పాకాల సరస్సు విహంగ వీక్షణం

వరంగల్‌ జిల్లా ఖానాపురం, కొత్తగూడ మండలాల పరిధిలోని పచ్చని చిలుకలగుట్ట.. పక్కనే పాకాల సరస్సు పర్యాటకులను మైమరపిస్తాయి. చిలుకలగుట్టను, సరస్సు అందాలను తిలకించడానికి వచ్చేవారి కోసం అటవీ శాఖ గుట్ట మీద చిలుకనగర్‌ వైపు రెండేళ్ల క్రితం వాచ్‌టవర్‌ నిర్మించింది. అయితే వాచ్‌టవర్‌ వద్దకు మూడు కి.మీ. మేర రాళ్ల దారిలో వెళ్లాల్సిరావడంతో పర్యాటకులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పాకాల సరస్సుకు.. రామప్ప సరస్సు నుంచి గోదావరి జలాల రాకతో పుష్కలంగా నీరు ఉంటోంది. ఈ సరస్సులో గతంలో బోటింగ్‌ సౌకర్యం ఉండేది. అయితే ఆదాయం పంచుకోవడంలో పర్యాటక, అటవీ శాఖల మధ్య విభేదాల కారణంగా ఈ సౌకర్యం నిలిచిపోయింది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన కొండా సురేఖ అటవీ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో.. వాచ్‌ టవర్‌కు రహదారి, సరస్సులో బోటింగ్‌ సౌకర్యం కల్పిస్తే ఇక్కడ పర్యాటకం ఊపందుకుంటుందని స్థానికులు విన్నవిస్తున్నారు.

- ఈనాడు, హనుమకొండ; న్యూస్‌టుడే, కొత్తగూడ, ఖానాపురం


చిలుకలగుట్టపై అటవీశాఖ ఏర్పాటు చేసిన వాచ్‌టవర్‌


రాళ్లు, రప్పలతో వాచ్‌టవర్‌కు వెళ్లే దారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని