నల్లమలలో పర్యాటకానికి మూడు నెలల విరామం

నల్లమల అటవీ ప్రాంతంలో జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు 3 నెలలపాటు సఫారీని నిలిపేయనున్నారు.

Published : 24 Jun 2024 04:22 IST

అచ్చంపేట న్యూటౌన్, న్యూస్‌టుడే: నల్లమల అటవీ ప్రాంతంలో జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు 3 నెలలపాటు సఫారీని నిలిపేయనున్నారు. నల్లమలలోని అమ్రాబాద్‌ పెద్ద పులుల సంరక్షణ కేంద్రం(ఏటీఆర్‌)లో పెద్దపులి, చిరుతలు, కణితి, దుప్పులు, నెమళ్లు, జింకలు తదితర జంతువుల సంతానోత్పత్తికి సరైన సమయం కావడంతో మూడు నెలలపాటు ఫర్హాబాద్, భౌరాపూర్, ఆక్టోపస్‌ తదితర పర్యాటక ప్రాంతాలకు అనుమతులను రద్దు చేస్తున్నామని నాగర్‌కర్నూల్‌ డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి పేర్కొన్నారు. వ్యూపాయింట్‌కు వెళ్లే సఫారీ వాహనాలను నిలిపేయనున్నామని, 90 రోజులపాటు జంతువులు స్వేచ్ఛాయుతంగా తిరుగుతాయని, పర్యాటకులు, వాహనాల శబ్ద కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులు, పర్యాటకులు అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నిబంధనలు పాటించాలని, ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని