అకుంఠిత దీక్షాపరుడు రామోజీరావు

రామోజీ గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నమ్మిన సిద్ధాంతం కోసం రాజీ పడకుండా ముందుకు సాగిన అకుంఠిత దీక్షాపరుడని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

Published : 24 Jun 2024 04:23 IST

కేంద్ర మంత్రి బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రామోజీ గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నమ్మిన సిద్ధాంతం కోసం రాజీ పడకుండా ముందుకు సాగిన అకుంఠిత దీక్షాపరుడని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ‘ఈనాడు’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సంజయ్‌ ఆదివారం పరామర్శించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీడియా ద్వారా రామోజీరావు అందించిన సేవలను సంజయ్‌ కొనియాడారు. రామోజీ గ్రూపు సంస్థల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పించారని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని