భక్త రామదాసు ధ్యానమందిరానికి కొత్త సొబగు

భద్రాచల రామాలయం నిర్మించిన కంచర్ల గోపన్న జన్మస్థలమైన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ధ్యానమందిరం నూతన రూపు సంతరించుకుంటోంది.

Published : 24 Jun 2024 04:23 IST

భద్రాచల రామాలయం నిర్మించిన కంచర్ల గోపన్న జన్మస్థలమైన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ధ్యానమందిరం నూతన రూపు సంతరించుకుంటోంది. భక్త రామదాసు నివాసమున్న స్థలంగా భావిస్తున్న ప్రదేశంలో 1955లో ధ్యానమందిరం నిర్మాణ పనులు ప్రారంభించగా.. 1961లో పూర్తయ్యాయి. 2000లో దీన్ని ఆధునికీకరించారు. ఆడిటోరియం పనులకు 2017లో సుమారు    రూ.2.30 కోట్లు మంజూరయ్యాయి. 2018లో శంకుస్థాపన చేశారు. ఆర్‌ అండ్‌ బీ ఆధ్వర్యంలో ఆంఫీథియేటర్‌ పనులు చేపట్టారు. సుమారు 500 మంది కూర్చునే సామర్థ్యమున్న ధ్యానమందిరంలో గోడలపై రామాయణ ఘట్టాల చిత్రాలను అందంగా చిత్రీకరించారు. ధ్యానమందిరానికి సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయి. మెట్లు, శౌచాలయాలు, నడక దారి తదితర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని మరో మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు ఆర్‌ అండ్‌ బీ ఏఈ దేవేందర్‌ తెలిపారు. 

ఈనాడు-ఖమ్మం, న్యూస్‌టుడే-నేలకొండపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు