‘నీట్‌’ అవకతవకలపై సుప్రీంకోర్టు జ్యుడిషియల్‌ కమిటీ నియమించాలి

‘నీట్‌’ నిర్వహణలో జరిగిన అక్రమాలతో 24 లక్షల మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ఈ పరీక్షను పూర్తిగా రద్దు చేసి గతంలో మాదిరి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు.

Published : 24 Jun 2024 04:24 IST

- ప్రొఫెసర్‌ హరగోపాల్‌

బషీర్‌బాగ్, న్యూస్‌టుడే: ‘నీట్‌’ నిర్వహణలో జరిగిన అక్రమాలతో 24 లక్షల మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ఈ పరీక్షను పూర్తిగా రద్దు చేసి గతంలో మాదిరి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. నీట్‌ అవకతవకలపై సీబీఐతో కాకుండా సుప్రీంకోర్టు జ్యుడిషియల్‌ కమిటీని నియమించి విచారణ జరిపించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం లోపభూయిష్ఠంగా ఉంది. నీట్‌లో జరిగిన అక్రమాలకు ఈ విద్యా విధానమే కారణం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాతీయ విద్యావిధానాన్ని పూర్తిగా తిరస్కరించి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక విధానం రూపొందించాలి. నీట్, నెట్‌లలో అవకతవకలకు పాల్పడిన ఎన్‌టీఏ అధికారులను తక్షణమే సస్పెండ్‌ చేసి కఠినంగా శిక్షించాలి’ అని హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. సమావేశంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్‌ కె.లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు కె.నారాయణ, ఎంఎన్‌ కిష్టప్ప, డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, టీపీటీఎఫ్‌ అధ్యక్షుడు వై.అశోక్‌కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, పీవైఎల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని