నేటి నుంచి జూడాల సమ్మె

రాష్ట్రంలో జూనియర్‌ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ (టీ-జూడా) ఆదివారం ప్రకటించింది.

Updated : 24 Jun 2024 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జూనియర్‌ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ (టీ-జూడా) ఆదివారం ప్రకటించింది. గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైపెండ్‌ చెల్లింపు, సూపర్‌ స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెంట్‌లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం, వైద్యకళాశాలలో పెంచిన 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని, వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి.. తదితర డిమాండ్లతో ఈ నెల 18న సమ్మె నోటీసు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. దీంతో నిరవధిక సమ్మె చేపట్టి విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు. ఓపీ సేవలు, సర్జరీలు, వార్డ్‌ సేవలను నిలిపివేస్తున్నామని, అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని