వందశాతం ఉన్నాయా?

రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తిగత మరుగుదొడ్లపై సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి గ్రామ పంచాయతీల కార్యదర్శులు, క్షేత్ర, సాంకేతిక సహాయకులు, బహుళవిధ కార్మికులు ప్రతి ఇంటికి వెళ్లి సమాచారం సేకరించాలని ఆదేశిస్తూ ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Published : 24 Jun 2024 04:30 IST

వ్యక్తిగత మరుగుదొడ్లపై నేటి నుంచి సర్వే
లేని వారికి మంజూరు!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తిగత మరుగుదొడ్లపై సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి గ్రామ పంచాయతీల కార్యదర్శులు, క్షేత్ర, సాంకేతిక సహాయకులు, బహుళవిధ కార్మికులు ప్రతి ఇంటికి వెళ్లి సమాచారం సేకరించాలని ఆదేశిస్తూ ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నట్లు నమోదు అయింది. దీనిలో వాస్తవాల నిర్ధారణతోపాటు మరుగుదొడ్లు లేని వారికి కొత్తవి మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తమ పంచాయతీలకు పురస్కారాల కోసం వ్యక్తిగత మరుగుదొడ్లపై సమాచారాన్ని ప్రభుత్వం ఏటా సేకరిస్తోంది. దీనిలో 100% ఉన్నట్లు గణాంకాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది సర్వే నిర్వహిస్తోంది. జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా పరిషత్‌ సీఈవోలు రోజు సర్వేను పర్యవేక్షించాలని ప్రభుత్వం సూచించింది. ఈ నెల 30లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. 

మిషన్‌ భగీరథ సర్వే కొనసాగుతుండగానే...

రాష్ట్రంలో ప్రస్తుతం మిషన్‌ భగీరథ సర్వే కొనసాగుతోంది. ఇల్లిల్లూ తిరిగి మంచినీటి నల్లా కనెక్షన్‌ ఉందా? లేదా? వచ్చే నీరు సరిపోతుందా? లేదా? ఇతరత్రా వివరాలు తీసుకుంటున్నారు. ఈ సమయంలోనే మరో సర్వేకు ప్రభుత్వం ఆదేశించడంతో గ్రామ పంచాయతీల కార్యదర్శులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమకు పనిభారం పెరుగుతోందని వారు ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని