చిరంజీవితో కేంద్రమంత్రి బండి సంజయ్‌ భేటీ

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఆదివారం ప్రముఖ నటుడు చిరంజీవితో భేటీ అయ్యారు.

Published : 24 Jun 2024 04:39 IST

బండి సంజయ్‌ను అభినందిస్తున్న చిరంజీవి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఆదివారం ప్రముఖ నటుడు చిరంజీవితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి మర్యాదపూర్వకంగా విచ్చేసిన సంజయ్‌ను చిరంజీవి శాలువా కప్పి సన్మానించారు. సుమారు అరగంటసేపు రాష్ట్ర, దేశ రాజకీయాలతోపాటు పలు ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కష్టపడి పైకొచ్చిన సంజయ్‌కు కేంద్ర మంత్రిగా గుర్తింపు లభించిందన్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధాని మోదీ తనను దగ్గరకు తీసుకుని పలకరించడం మర్చిపోలేని అనుభూతిగా మిగిలిందని పేర్కొన్నారు. సంజయ్‌ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే తాను చిరంజీవి అభిమానినని తెలిపారు. ఏపీలో తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమి మంచి ఫలితాలు సాధించిందని, ప్రజలకు మంచి పాలన అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు