ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

రాష్ట్రంలో గత మే నెలలో జరిగిన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తదితరులు వాటిని విడుదల చేశారు.

Published : 25 Jun 2024 04:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గత మే నెలలో జరిగిన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తదితరులు వాటిని విడుదల చేశారు. ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు(జనరల్‌) 1,38,477 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 60,615(43.77 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 15,136 మందికి 7,737(51.12 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 2,54,498 మంది విద్యార్థులు పరీక్షలు(జనరల్‌) రాయగా.. 1,62,520 మంది (63.86 శాతం), ఒకేషనల్‌లో 18,913 మందికి 10,070(53.24 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని