జనగామ కలెక్టరేట్‌లో యువరైతు ఆత్మహత్యాయత్నం

తమ భూ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఓ యువరైతు జనగామ కలెక్టరేట్‌లో సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జనగామ మండలం పసరమడ్లకు చెందిన నర్సింగరావు(35) తన కుటుంబంతో సహా కొన్నేళ్ల క్రితం ములుగు జిల్లాకు వలస వెళ్లారు.

Published : 25 Jun 2024 04:48 IST

భూ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌
అయిదేళ్లలో ఇది నాలుగోసారి

పురుగుల మందు తాగుతున్న బాధితుడు నర్సింగరావు

జనగామ అర్బన్, న్యూస్‌టుడే: తమ భూ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఓ యువరైతు జనగామ కలెక్టరేట్‌లో సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జనగామ మండలం పసరమడ్లకు చెందిన నర్సింగరావు(35) తన కుటుంబంతో సహా కొన్నేళ్ల క్రితం ములుగు జిల్లాకు వలస వెళ్లారు. తమ ఎనిమిదెకరాలను దాయాదులు అక్రమంగా పట్టా చేయించుకున్నారని అయిదేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇదే సమస్యపై గతంలో మూడుసార్లు కలెక్టరేట్‌లోనే ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం మరోసారి కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తుపైకి ఎక్కి... సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కలు న్యాయం చేయాలని ఫ్లెక్సీని కట్టి పురుగుమందు తాగారు. అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా స్పందిస్తూ... సివిల్‌ సమస్యలను కోర్టులోనే పరిష్కరించుకోవాలని నర్సింగరావు తండ్రి కొమురయ్యకు చెప్పామని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నర్సింగరావుపై  చర్యలు తీసుకునే విషయమై పరిశీలిస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని