ఆ ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలపండి

రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను తాజా డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలపాలని డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్‌ చేశారు.

Published : 25 Jun 2024 04:49 IST

రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ఆందోళన

హనుమకొండ జిల్లా గ్రంథాలయం వద్ద ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను తాజా డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలపాలని డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలపాలంటూ అభ్యర్థులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాలు, స్టడీ హాళ్ల వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కొత్తగా టెట్‌ పాసైన వాళ్లు కూడా డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు వీలుగా జులైలో నిర్వహించే పరీక్షలను కనీసం 40 రోజులపాటు వాయిదా వేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని