ఫోన్‌ ట్యాపింగ్‌లో పోలీసులకు మరోమారు చుక్కెదురు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అభియోగపత్రాన్ని న్యాయస్థానం మరోమారు తిరస్కరించగా పోలీసులకు మళ్ళీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి పంజాగుట్ట పోలీసులు మార్చి 10న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Published : 25 Jun 2024 04:54 IST

అభియోగపత్రం తిరస్కరించిన న్యాయస్థానం! 

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అభియోగపత్రాన్ని న్యాయస్థానం మరోమారు తిరస్కరించగా పోలీసులకు మళ్ళీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి పంజాగుట్ట పోలీసులు మార్చి 10న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆరుగుర్ని నిందితులుగా పేర్కొని నలుగుర్ని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్సైబీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావులు విదేశాల్లో ఉన్నారు. ఇప్పటి వరకూ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా జూన్‌ రెండో వారంలో పోలీసులు నాంపల్లి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం సాంకేతిక అంశాలను కారణాలుగా చూపుతూ తిప్పి పంపింది. దాంతో అభియోగపత్రంలో అవసరమైన మార్పులు చేసిన పోలీసులు గత వారం మళ్లీ న్యాయస్థానంలో దాఖలు చేశారు. కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గత శనివారం మళ్లీ దీన్ని న్యాయస్థానం తిప్పి పంపినట్లు తెలుస్తోంది. దీంతో అవసరమైన మార్పులు, చేర్పులు చేసి పోలీసులు మంగళవారం మరోమారు అభియోగపత్రం దాఖలు చేయనున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని