గనుల రంగంలో 15 రోజులకో సంస్కరణ తీసుకొస్తాం

గనుల రంగంలో ప్రతి పదిహేను రోజులకు ఒక సంస్కరణ తీసుకొస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గనుల వేలం కారణంగా రాష్ట్రాలకు ఆదాయం లభించడంతోపాటు వేలమందికి ఉపాధి లభిస్తుందన్నారు.

Updated : 25 Jun 2024 05:57 IST

వేలం ప్రక్రియతో రాష్ట్రాల ఆదాయమూ పెరుగుతుంది
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

నాలుగో విడత గనుల వేలాన్ని సహాయమంత్రి సతీష్‌ చంద్ర దూబేతో కలిసి ప్రారంభిస్తున్న కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: గనుల రంగంలో ప్రతి పదిహేను రోజులకు ఒక సంస్కరణ తీసుకొస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గనుల వేలం కారణంగా రాష్ట్రాలకు ఆదాయం లభించడంతోపాటు వేలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. సోమవారం దిల్లీలో సంక్లిష్ట ఖనిజ(క్రిటికల్‌ మినరల్‌) గనుల నాలుగో విడత వేలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్‌ అయిదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు గనుల రంగంలో సాధించే ప్రగతి ఎంతో ముఖ్యం. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాతే ఈ రంగం నుంచి రాష్ట్రాలకు తగిన వాటా అందుతోంది. ఒక్క ఒడిశాకే యేటా రూ.40 వేల కోట్ల లబ్ధి చేకూరుతోంది. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా సహకరించాలి. ప్రస్తుతం రాగి వంటి ఖనిజాలను స్థానిక అవసరాల కోసం దిగుమతి చేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఖనిజాల తవ్వకంతోపాటు పర్యావరణ పరిరక్షణా తమకు ముఖ్యమేనని, రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. వేలంలో గనులు పొందినవారు వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని