మెట్రో ఆదాయం రూ.1407.81 కోట్లు

హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ఆదాయం ఏకంగా 105% పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1407.81 కోట్ల రాబడి వచ్చిందని, అంతకుముందు 2022-23లో ఇది రూ.703.20 కోట్లు మాత్రమేనని ఎల్‌అండ్‌టీ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.

Published : 25 Jun 2024 05:01 IST

భూముల స్లంప్‌సేల్‌ ద్వారా భారీ ఆర్జన
అయినా, మార్చి 31 నాటికి మొత్తంగా రూ.5979 కోట్ల నష్టం 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ఆదాయం ఏకంగా 105% పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1407.81 కోట్ల రాబడి వచ్చిందని, అంతకుముందు 2022-23లో ఇది రూ.703.20 కోట్లు మాత్రమేనని ఎల్‌అండ్‌టీ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో టికెట్ల అమ్మకంతో రూ.611.48 కోట్లు వచ్చాయి. రవాణా ఆధారిత అభివృద్ధి(టీవోడీ) నుంచి రూ.796.33 కోట్లు వచ్చాయి. టీవోడీలో మాల్స్, కార్యాలయాల అద్దెలు, టెలికాం టవర్లు, ప్రకటనల ద్వారా రూ.284.60 కోట్లు రాగా... మెట్రోకి ప్రభుత్వం లీజుపై ఇచ్చిన రాయదుర్గంలోని భూమిని స్లంప్‌సేల్‌ రూపంలో రహేజా గ్రూప్‌నకు, బ్రూక్‌ఫీల్డ్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేయడం ద్వారా తొలివిడతలో రూ.511.73 కోట్లు వచ్చాయి. ఇక మెట్రో నిర్వహణకు రూ.1962.85 కోట్లు ఖర్చయ్యాయి. ఆదాయం 1407.81 పోగా రూ.555.04 కోట్ల నష్టాలు మిగిలాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి మెట్రో మొత్తం నష్టాలు రూ.5979.36 కోట్లకు చేరినట్లుగా ఎల్‌అండ్‌టీ మెట్రో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని