సాంకేతికతతో.. సమస్యల పరిష్కారం

ప్రజావాణిని ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు కామారెడ్డి కలెక్టర్‌ అశిష్‌ సాంగ్వాన్‌ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. సాంకేతికతను వినియోగంలోకి తెచ్చారు.

Published : 25 Jun 2024 05:20 IST

అర్జీదారుని సమక్షంలో అధికారులతో వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అశిష్‌ సాంగ్వాన్‌

ఈనాడు, కామారెడ్డి: ప్రజావాణిని ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు కామారెడ్డి కలెక్టర్‌ అశిష్‌ సాంగ్వాన్‌ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. సాంకేతికతను వినియోగంలోకి తెచ్చారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతోపాటు సంబంధిత అధికారులతో అర్జీదారుల సమక్షంలోనే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి సమస్య పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు.

నిర్వహణ ఇలా..: జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్‌ అధికారులతోపాటు 25 మండలాలు, మూడు పురపాలికల అధికారులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టరేట్‌ ప్రజావాణికి అనుసంధానం చేశారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి సంబంధిత మండల అధికారులతో వీసీలో మాట్లాడి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో మండల, జిల్లా స్థాయి అధికారుల మధ్య సమన్వయం కుదిరి.. నెలలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. ఫిర్యాదుదారులు ఈ విధానంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిలో భారీ స్క్రీన్‌ పెట్టించి అనుసంధాన ప్రక్రియను తెరపై చూసే విధంగా ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని