పూర్తయిన రబీ ధాన్యం కొనుగోళ్లు

రబీ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తం 8,99,546 మంది రైతుల ఖాతాల్లో రూ.10,547 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Published : 04 Jul 2024 03:00 IST

48 లక్షల టన్నుల సేకరణ
రైతులకు రూ.10,547 కోట్ల చెల్లింపులు

ఈనాడు, హైదరాబాద్‌: రబీ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తం 8,99,546 మంది రైతుల ఖాతాల్లో రూ.10,547 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 48 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. జూన్‌ 30న రబీ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసినట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 75.40 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు జరుగుతాయని సంస్థ అంచనా వేసింది. కాగా, వడ్లకు మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ ధర రావడం, ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి ఎక్కువ ధరకు కొనుగోలు చేయటంతో కేంద్రాలకు వచ్చిన ధాన్యం తగ్గిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,532 మంది మిల్లర్లు ధాన్యం ఇవ్వకుండా ఎగవేయగా.. 116 మందిపై పౌరసరఫరాల విభాగం రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రయోగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని