జనావాసాల్లోకి కోతులు రాకుండా చర్యలు

అడవుల్లో పండ్ల మొక్కలు పెంచి... జనావాసాల్లోకి కోతులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, గిరిజనుల ఉపాధికి సైతం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Published : 04 Jul 2024 03:02 IST

అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ

లంకపల్లి అటవీ ప్రాంతంలో విద్యార్థులతో కలిసి మొక్క నాటిన మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.చిత్రంలో ఎమ్మెల్యే రాగమయి, అధికారులు 

సత్తుపల్లి, న్యూస్‌టుడే: అడవుల్లో పండ్ల మొక్కలు పెంచి... జనావాసాల్లోకి కోతులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, గిరిజనుల ఉపాధికి సైతం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రభుత్వం, ఆషా స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం వన మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక జేవీఆర్‌ కళాశాల ప్రాంగణంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి ఆమె మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో మంత్రి సురేఖ మాట్లాడుతూ... ‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 1950లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే వన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. వరంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి తిరిగి వన మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల మొక్కలను నాటి, రక్షించాలని అన్ని శాఖలకు లక్ష్యాలను నిర్దేశించాం’’ అని వివరించారు. అనంతరం పెనుబల్లి మండలం లంకపల్లి గొల్లగూడెం బీట్‌లోనూ వనమహోత్సవాన్ని మంత్రులు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఓఎస్‌డీ నదీమ్‌అహ్మద్, సీసీఎఫ్‌ భీమానాయక్, అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, సన్యాసయ్య, సీపీ సునీల్‌దత్, డీఎఫ్‌వో సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్, డీపీఓ హరికిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని