సంక్షేమ కార్పొరేషన్లలో సిబ్బంది ఎంతమంది?

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం కోసం కొత్తగా ప్రకటించిన 16 కార్పొరేషన్లు, బోర్డులు, సమాఖ్యలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

Published : 04 Jul 2024 03:17 IST

కొత్త కార్పొరేషన్లు, బోర్డుల నిర్వహణ కోసం సమాచారం కోరిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం కోసం కొత్తగా ప్రకటించిన 16 కార్పొరేషన్లు, బోర్డులు, సమాఖ్యలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ప్రస్తుతమున్న కార్పొరేషన్లు, ఫెడరేషన్లలోని సిబ్బంది వివరాలను వెంటనే అందించాలని సంక్షేమశాఖల విభాగాధిపతులను కోరింది. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీలు, కొత్త కార్పొరేషన్లకు కావాల్సిన అదనపు సిబ్బందికి సంబంధించి ప్రతిపాదనలను ఆ శాఖలు సిద్ధం చేస్తున్నాయి. బడ్జెట్‌ సమావేశాల నాటికి వీటన్నింటినీ కార్యరూపంలోకి తీసుకురావాని ప్రభుత్వం భావిస్తోంది.

ఖాళీగా ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ పోస్టు

రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఎండీగా పనిచేసిన ఎస్సీ సంక్షేమశాఖ అదనపు సంచాలకులు కరుణాకర్‌ జూన్‌ 30న పదవీ విరమణ చేశారు. సాధారణంగా పదవీ విరమణ చేసిన తరువాత ఆ కార్పొరేషన్‌లో ఉన్నతాధికారికి లేదా ఎస్సీ సంక్షేమశాఖ అధికారికి ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. కానీ అలా చేయకపోవడంతో కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు, సిబ్బంది సర్దుబాటు దస్త్రాలు నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని