ప్రభుత్వాసుపత్రుల్లోని ఒప్పంద ఉద్యోగులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి

రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

Published : 04 Jul 2024 03:18 IST

మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌

హైదరాబాద్‌ కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఒప్పంద ఉద్యోగులు, ఏఐటీయూసీ నాయకులు

సుల్తాన్‌బజార్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. వేతనాలు పెంచడంతోపాటు శ్రమదోపిడీని అరికట్టాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌ కోఠిలోని రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన ఉద్యోగులు తమకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ యూసుఫ్, ఎ.నరసింహలు మాట్లాడుతూ.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలోని శానిటేషన్, పేషెంట్‌ కేర్, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీవో 60 ప్రకారం రూ.13,600 వేతనం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సంఘం ప్రతినిధులు.. తమ డిమాండ్లపై డీఎంఈ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని