ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి బ్యాంకు లాకర్లు తెరిచిన ఈడీ

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డికి చెందిన బ్యాంకు లాకర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు బుధవారం తెరిచారు.

Published : 04 Jul 2024 03:21 IST

పటాన్‌చెరు అర్బన్, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డికి చెందిన బ్యాంకు లాకర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు బుధవారం తెరిచారు. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామ పరిధిలో ఉన్న సంతోష్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్‌ క్వారీలో అక్రమాలు జరిగినట్లు రెవెన్యూ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. జూన్‌ 20న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి ఇళ్లపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని దస్త్రాలు వెంట తీసుకెళ్లారు. ఎమ్మెల్యేను మంగళవారం హైదరాబాద్‌ కార్యాలయంలో ఈడీ అధికారులు విచారించారు. బుధవారం పటాన్‌చెరులోని యాక్సిస్, ఎస్‌బీఐ బ్యాంక్‌లకు మహిపాల్‌రెడ్డిని తీసుకెళ్లి లాకర్లు తెరిచి తనిఖీలు నిర్వహించారు. యాక్సిస్‌ బ్యాంక్‌ లాకర్‌ నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని