శస్త్రచికిత్స అవసరం లేకుండానే..దెబ్బతిన్న మోకాలి భాగం తిరిగి అమరిక

శస్త్రచికిత్స అవసరం లేకుండానే 40 సంవత్సరాల వ్యక్తికి మోకాలిలో దెబ్బతిన్న భాగాన్ని తిరిగి అమర్చిన అరుదైన చికిత్సను హైదరాబాద్‌ బేగంపేటలోని కిమ్స్‌ సన్‌షైన్‌ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.

Published : 04 Jul 2024 03:24 IST

కిమ్స్‌ సన్‌షైన్‌ ఆసుపత్రిలో అరుదైన చికిత్స

శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య బృందంతో డా.గురవారెడ్డి 

బేగంపేట, న్యూస్‌టుడే: శస్త్రచికిత్స అవసరం లేకుండానే 40 సంవత్సరాల వ్యక్తికి మోకాలిలో దెబ్బతిన్న భాగాన్ని తిరిగి అమర్చిన అరుదైన చికిత్సను హైదరాబాద్‌ బేగంపేటలోని కిమ్స్‌ సన్‌షైన్‌ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండీ డా.ఎ.వి.గురవారెడ్డి, ఆర్థోపెడిక్, ఆర్థోస్కోపీ సర్జన్‌ డా.కుషాల్‌ హిపాల్‌ గోవాంకర్‌ తదితరులు వివరాలను వెల్లడించారు. యువతలో మృదులాస్థి గాయాల కారణంగా మోకాలి నొప్పి కుంగదీస్తుందన్నారు. ఇటువంటి వారికి ఏపీసీలర్‌ జాయింట్‌ రీసర్ఫేసింగ్‌ ఫోకల్‌ ఆస్ట్రియోకాండ్రల్‌ లోపాలు, ఆస్టియో ఆర్థరైటిస్‌ గాయాల చికిత్సల కోసం నిర్దిష్టమైన ఇంప్లాంట్స్‌తో కూడిన సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఈ పద్ధతిలో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అవసరం లేకుండా దెబ్బతిన్న మోకాలి ఉపరితలాన్ని ఎమ్మారై స్కాన్‌ చేయడం ద్వారా డేటా ప్రాసెసింగ్‌ చేసి గాయాన్ని గుర్తించి వర్చువల్‌ 3డీ మోడల్‌ తయారు చేస్తామని తెలిపారు. ఏపీసీలర్‌ పరికరాలతో దెబ్బతిన్న కణజాలాన్ని తొలగించి ఆ భాగంలో ఇంప్లాంట్‌ను అమర్చామన్నారు. సమావేశంలో కిమ్స్‌ సన్‌షైన్‌ ఆసుపత్రి సీఈఓ సుధాకర్‌ జాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని