వరంగల్‌ నిట్‌ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ

వరంగల్‌లోని జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్‌ (ఈసీఈ) విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కినట్లు నిట్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 04 Jul 2024 09:30 IST

ఈనాడు, వరంగల్, నిట్‌ క్యాంపస్‌, న్యూస్‌టుడే: వరంగల్‌లోని జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్‌ (ఈసీఈ) విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కినట్లు నిట్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన రవిషా తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. కోడింగ్‌లో మెలకువలు, క్లబ్‌ల నుంచి అందిన మార్గదర్శకత్వం తనకు తోడ్పడ్డాయని రవిషా తెలిపారు. మరో 12 మంది విద్యార్థులకు రూ.68 లక్షల వార్షిక వేతన ప్యాకేజీలు లభించగా, 82 శాతం మంది బీటెక్‌ విద్యార్థులు కొలువులు సాధించారని నిట్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని