న్యాయవాదుల పరిహారం రూ.4 నుంచి రూ.6 లక్షలకు పెంపు

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో నమోదై సంక్షేమ నిధిలో సభ్యత్వం ఉన్న న్యాయవాదులు మృతిచెందితే వారి కుటుంబసభ్యులకు ఇచ్చే పరిహారాన్ని రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి గురువారం వెల్లడించారు.

Published : 05 Jul 2024 03:12 IST

బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి వెల్లడి

ఈనాడు, హైదారాబాద్‌: రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో నమోదై సంక్షేమ నిధిలో సభ్యత్వం ఉన్న న్యాయవాదులు మృతిచెందితే వారి కుటుంబసభ్యులకు ఇచ్చే పరిహారాన్ని రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి గురువారం వెల్లడించారు. జులై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. సుమారు 53,220 మంది న్యాయవాదులు బార్‌ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్నారని, ఇందులో సంక్షేమ నిధిలో సభ్యత్వం తీసుకున్న వారి కుటుంబసభ్యులకే ఈ పరిహారం లభిస్తుందని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని