‘విశ్వంభర’ పురస్కారానికి శివశంకరి ఎంపిక

ప్రతిష్ఠాత్మకమైన ‘విశ్వంభర’ డా.సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరం సుప్రసిద్ధ తమిళ రచయిత్రి, సరస్వతీ సమ్మాన్‌ పురస్కార గ్రహీత శివశంకరి ఎంపికయ్యారు.

Published : 05 Jul 2024 03:14 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ప్రతిష్ఠాత్మకమైన ‘విశ్వంభర’ డా.సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరం సుప్రసిద్ధ తమిళ రచయిత్రి, సరస్వతీ సమ్మాన్‌ పురస్కార గ్రహీత శివశంకరి ఎంపికయ్యారు. పురస్కారం కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించనున్నారు. ఈ నెల 29న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగే డాక్టర్‌ సి.నారాయణరెడ్డి 93వ జయంతి ఉత్సవంలో ఆమెకు పురస్కారం ప్రదానం చేయనున్నట్లు శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు అధ్యక్షురాలు సి.గంగ, ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌లను ఆహ్వానిస్తున్నట్లు వారు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు