కూలుతున్న పాపన్న కోట గోడలు

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో 18వ శతాబ్దంలో సర్దార్‌ సర్వాయి పాపన్న నిర్మించిన కోట చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది.

Published : 06 Jul 2024 03:11 IST

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో 18వ శతాబ్దంలో సర్దార్‌ సర్వాయి పాపన్న నిర్మించిన కోట చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. జాగీర్దార్‌లకు వ్యతిరేకంగా యువకులను, సబ్బండ వర్గాలను సమీకరించి పాపన్న ఈ కోటను నిర్మించారు. శిథిలమవుతున్న ఈ కోట పునరుద్ధరణకు రూ.4.75 కోట్లతో పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖలు ప్రతిపాదించగా 2013 నుంచి ప్రభుత్వం దశలవారీగా నిధులు కేటాయించింది. ఆ నిధులతో కోట మధ్యలో బురుజు నిర్మాణం, కూలిపోయే పరిస్థితుల్లో ఉన్న గోడలకు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. 2021 మేలో  భారీ వర్షాలకు కోట గోడలోని ఓ భాగం కూలిపోగా రూ.50 లక్షల వ్యయంతో పునరుద్ధరించారు. మిగిలిన భాగంలో గోడలు ప్రస్తుతం శిథిలమై కూలుతున్నాయి. వీటిని పునరుద్ధరించి చారిత్రక కోటను కాపాడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈనాడు, హనుమకొండ; న్యూస్‌టుడే, రఘునాథపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని