భూముల ధరల సవరణ ప్రతిపాదనలకు మరో వారం

రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువ సవరణకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి మరో వారం రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి.

Published : 06 Jul 2024 03:12 IST

మరోమారు క్షేత్రస్థాయిలో కసరత్తు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువ సవరణకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి మరో వారం రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి కొత్త మార్కెట్‌ విలువను అమలు చేయడానికి ప్రభుత్వం లక్ష్యం విధించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గత నెల 18నే రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి కేంద్ర కార్యాలయానికి ప్రతిపాదనలు అందాయి. గత నెల 25న వాటిపై సమీక్ష నిర్వహించి 29న జిల్లాల్లోని కమిటీలకు వాటిని పంపాల్సి ఉంది. కమిటీల ఆమోదం అనంతరం ఆ ప్రతిపాదనలను ఈ నెల 1న వెబ్‌పోర్టల్లో ప్రదర్శించి ప్రజల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి సమావేశంలో మంత్రి పొంగులేటి పలు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. ఖమ్మం జిల్లాలో కొన్నిచోట్ల ప్రభుత్వ మార్కెట్‌ విలువ కన్నా బహిరంగ ధర తక్కువగా ఉందని.. ఇలాంటివి గుర్తించి సవరించాలని సూచించినట్లు తెలిసింది. వారం రోజుల్లో సవరణలు పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ ప్రక్రియను పూర్తి చేసి ఆగస్టు 1 నాటికి షెడ్యూల్‌ ప్రకారం ముందుకెళ్తామని రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు