పర్యాటక హబ్‌గా నల్లమల

నల్లమల ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Published : 06 Jul 2024 03:13 IST

మంత్రి జూపల్లి కృష్ణారావు

ఫర్హాబాద్‌ వ్యూ పాయింట్‌ వద్ద మంత్రులు దామోదర్‌ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, అధికారులు

అచ్చంపేట న్యూటౌన్, అమ్రాబాద్, న్యూస్‌టుడే: నల్లమల ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టూరిజం స్టడీటూర్‌లో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వాకిటి శ్రీహరి, డా.రాజేశ్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌లతో కలిసి మంత్రి జూపల్లి శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమలలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అమ్రాబాద్‌ పెద్ద పులుల సంరక్షణ ప్రాంతం (ఏటీఆర్‌)లో దర్శనీయ స్థలాలను పరిశీలించారు. జూపల్లి మాట్లాడుతూ.. నల్లమలలో ప్రసిద్ధి చెందిన ఉమామహేశ్వర క్షేత్రాభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తామన్నారు. అమ్రాబాద్‌ అభయారణ్యంలో భౌరాపూర్, మల్లెలతీర్థం, ఉమామహేశ్వరం, మద్దిమడుగు, వజ్రాలమడుగుతో పాటు ఆక్టోపస్, ఫర్హాబాద్‌ దృశ్య కేంద్రాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు. అమ్రాబాద్‌ మండలం మన్ననూరులోని చింతల చెరువులో వనమహోత్సవం నిర్వహించి మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్‌ సంతోష్, డీఎఫ్‌వో రోహిత్, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్, సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, పురావస్తు శాఖ డైరెక్టర్‌ భారతి హోళికేరి, పీసీసీఎఫ్‌ డోబ్రియల్, ఈవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని