ఉద్యాన పంటల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి

పండ్లు, కూరగాయలు ఇతర ఉద్యాన పంటల సాగులో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని, ఆయా తోటల సాగుకు ఊరూరా రైతులను చైతన్యపరచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Published : 06 Jul 2024 03:14 IST

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కొత్త ఉద్యాన అధికారులకు నియామక పత్రాలు 

నియామక పత్రాలను అందజేసిన అనంతరం నూతన ఉద్యాన అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఈనాడు, హైదరాబాద్‌: పండ్లు, కూరగాయలు ఇతర ఉద్యాన పంటల సాగులో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని, ఆయా తోటల సాగుకు ఊరూరా రైతులను చైతన్యపరచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా ఎంపికైన 18 మంది కొత్త ఉద్యాన అధికారులకు శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో సాగు ఏటేటా పెరుగుతున్నా ఉద్యాన పంటలు తగ్గడం ఆందోళనకరంగా ఉందని, దానిపైనా ప్రభుత్వం తోటల పెంపకాన్ని భారీగా పెంచేందుకు ప్రత్యేకదృష్టి సారించిందని తెలిపారు. కూరగాయలు, పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితులు పోయి మనమే ఎగుమతి చేసేలా తెలంగాణ అభివృద్ధి సాధించాలన్నారు. కొత్త అధికారులు ఉద్యాన పంటల ప్రాధాన్యాన్ని గుర్తించి, రైతుల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యాన సంచాలకురాలు యాస్మిన్‌ బాషా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని