జాతీయ రహదారులకు రూ.3,834 కోట్లు

రాష్ట్రంలోని జాతీయ రహదారుల పటిష్ఠం, మరమ్మతులకు కేంద్రం రూ.3,834 కోట్లు కేటాయించింది. పలు రహదారుల విస్తరణ, బైపాస్‌రోడ్లు, వంతెనల భద్రతకు ఈ నిధులు మంజూరు చేసేందుకు వీలుగా 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళికలో చేర్చినట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది.

Published : 06 Jul 2024 03:17 IST

కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని జాతీయ రహదారుల పటిష్ఠం, మరమ్మతులకు కేంద్రం రూ.3,834 కోట్లు కేటాయించింది. పలు రహదారుల విస్తరణ, బైపాస్‌రోడ్లు, వంతెనల భద్రతకు ఈ నిధులు మంజూరు చేసేందుకు వీలుగా 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళికలో చేర్చినట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.7,110 కోట్లను కేంద్రం ఇంతకు మునుపే మంజూరు చేసింది. వాటికి అదనంగా తాజాగా ఈ నిధులను కేటాయించింది. ఇందులో ప్రధానంగా  121 కిలోమీటర్ల రహదారులను పటిష్ఠం చేసేందుకు అనుమతిస్తూ రూ.1,709 కోట్లు కేటాయించింది. నల్గొండ బైపాస్‌ రోడ్డుతోపాటు మరో మూడు ప్రాంతాల్లో బైపాస్‌రోడ్లు నిర్మాణానికి అనుమతిచ్చింది. ఇటీవల సవివరణ నివేదిక(డీపీఆర్‌)లకు కూడా ఆమోదించింది. ఈ మేరకు నాలుగు రోడ్ల నిర్మాణానికి రూ.1,325 కోట్లు కేటాయించింది. వంతెనలు, ఆర్వోబీల నిర్మాణానికి రూ.230 కోట్లు, రహదారి భద్రతకు రూ.90 కోట్లు, మరమ్మతులకు రూ.321 కోట్లు నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని