ఇక్కడ వంద మందికి ఒక్క సారు.. అక్కడ విద్యార్థులే లేరు

సర్కారు విద్యావ్యవస్థలో లోపాలకు కొన్ని పాఠశాలలు అద్దం పడుతున్నాయి. కొన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోగా.. మరికొన్ని బడుల్లో అసలు విద్యార్థులు లేకపోవడంతో సార్లు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది.

Published : 06 Jul 2024 06:08 IST

జగిత్యాల జిల్లా దోనూరు బడిలో ఇలా..

సర్కారు విద్యావ్యవస్థలో లోపాలకు కొన్ని పాఠశాలలు అద్దం పడుతున్నాయి. కొన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోగా.. మరికొన్ని బడుల్లో అసలు విద్యార్థులు లేకపోవడంతో సార్లు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆరేళ్ల క్రితం 18 మంది విద్యార్థులే ఉండగా.. ప్రధానోపాధ్యాయుడు కాశెట్టి రమేశ్, గ్రామస్థుల చొరవతో పిల్లల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 102 మంది చదువుతున్నారు. గతేడాది ఇద్దరు ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై వచ్చి బోధించగా.. ఈ ఏడాది వారు తమ తమ బడులకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఒక్క ఉపాధ్యాయుడే మిగిలారు. మరోవైపు, నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్‌ మండలం గట్టుమీది తండా గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ బడిలో గతేడాది నుంచి విద్యార్థులు చేరడం లేదు. వారి హాజరు శాతం సున్నా. ఇటీవలి బదిలీల్లో ఈ పాఠశాలకు ఓ ఉపాధ్యాయుడిని కేటాయించారు. ఆయన గ్రామంలోకి వెళ్లి ఆరా తీయగా.. తండాలోని 16 మంది విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపుతున్నారని తెలిసింది. 

నల్గొండ జిల్లా గట్టుమీది తండా పాఠశాలలో ఖాళీగా కూర్చున్న ఉపాధ్యాయుడు

న్యూస్‌టుడే-ధర్మపురి గ్రామీణం, ఈనాడు-నల్గొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని